ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » క్రికెటర్ శ్రీశాంత్‌కు బీసీసీఐ ఆఖరి హెచ్చరిక (BCCI | final warning | Sreesanth | Domestic Cricket | KCA | Irani Cup)
వివాదాస్పద క్రికెటర్‌గా పేరుగడించిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చివరి హెచ్చరిక చేసింది. యువ క్రికెటర్లకు ఆదర్శ ప్రాయంగా ఉండేలా మైదానంలో ప్రవర్తన ఉంటూ, హుందాగా నడుచుకోవాలని సూచించింది.
అంతేకాకుండా మైదానంలో మరో మారు తప్పు పునరావృత్తం అయితే స్వదేశీ క్రికెట్ నుంచి బహిష్కరిస్తామని బీసీసీఐ హెచ్చరించింది. ఈ మేరకు కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ)కు ఈనెల ఐదో తేదీన బీసీసీఐ లేఖను పంపినట్టు సమాచారం.
తాజాగా, నాగ్‌పూర్‌లో జరిగిన ఇరానీ కప్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా మైదానంలో శ్రీశాంత్ ప్రవర్తన సరిగాలేదు. దీనిపై బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
బీసీసీఐ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే సహించేది లేదని, ఇదే చివరి హెచ్చరిక అని పేర్కొంది. ఇలాంటి ప్రవర్తనే పునరావృత్తం అయితే మళ్లీ స్వదేశీ క్రికెట్ నుంచి బహిష్కరించే అవకాశాలు లేకపోలేదని బీసీసీఐ హెచ్చరించింది.