వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాక్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న యూనిస్ ఖాన్ (Younus Khan | Pakistan Cricket | Captain | Fixing | Australia | Newzealand)
Feedback Print Bookmark and Share
 
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీకి సీనియర్ ఆటగాడు యూనిస్ ఖాన్ గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులకు మంగళవారం పంపారు. అయితే, యూనిస్ రాజీనామాను బోర్డు తిరస్కరించినట్టు పీసీబీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్థాన్ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై పాక్ జాతీయ అసెంబ్లీ క్రీడల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జంషద్ దస్తీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌లో పాక్ కావాలనే ఓడిందన్నారు.

ఈ వ్యాఖ్యలతో యూనిస్ ఖాన్ కలత చెందాడు. పైపెచ్చు.. స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని యూనిస్‌తో పాటు జట్టు కోచ్, పీసీబీ ఛైర్మన్‌లకు స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంతో విసిగి పోయిన యూనిస్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

దీనిపై యూనిస్ స్పందిస్తూ.. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూశాను. కెప్టెన్సీని వదులుకోవడంలో ఎలాంటి బాధలేదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.