మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో మనస్సు కలత చెందిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ చేసిన రాజీనామాను ఆ దేశ క్రికెట్ బోర్డు తోసిపుచ్చినట్టు సమాచారం. రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిందిగా యూనిస్‌ను బోర్డు వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఫలితంగా యూనిస్ వెనకడుగు వేసినట్టు సమాచారం.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో కెప్టెన్సీ పదవికి యూనిస్ ఖాన్ రాజీనామా చేశాడు. అయితే దీనిని పాకిస్థాన్ బోర్డు తిరస్కరించింది. జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ పాకిస్థాన్ ఆటతీరుపై వివరణ కోరింది.
ఈ సంఘటనతో తీవ్రంగా కలత చెందిన యూనిస్ ప్రకటించాడు. కాగా, పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ భట్, కోచ్ ఇంతిఖాబ్ ఆలమ్, జట్టు మేనేజర్ యావార్ సయ్యద్‌లను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల చేతిలో పాకిస్థాన్ ఓటమికి వివరణ ఇవ్వాల్సిందిగా సంఘం కోరింది. ఈ సంఘటన పాక్ క్రికెట్ బోర్డులో పెద్ద వివాదానికే దారితీసింది.