ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాకిస్థాన్‌తో వన్డే సిరీస్: కివీస్ జట్టులో వెట్టోరీకి చోటు (New Zealand | Gamble | Pakistan | Vettori | UAE | Wellington | Oneday Series)
పాకిస్థాన్‌తో వన్డే సిరీస్: కివీస్ జట్టులో వెట్టోరీకి చోటు
శుక్రవారం, 16 అక్టోబర్ 2009( 10:36 IST )
వచ్చే నెలలో తటస్థ వేదికలో పాకిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికె బోర్డు జాతీయ సెలక్టర్లు పెద్ద రిస్క్ తీసుకున్నారు. గాయపడిన కెప్టెన్ డేనియర్ వెట్టోరి, ఆల్‌రౌండర్ జాకబ్ ఓరమ్‌లకు చోటు కల్పించారు. అయితే, వన్డే సిరీస్ ప్రారంభంనానికి ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.
గురువారం ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో వీరిద్దరికి చోటు కల్పించారు. కాగా, వన్డే సిరీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగనుంది. అంతేకాకుండా జట్టులోకి కొత్తగా ఒక కొత్త యువ క్రికెటర్‌కు చోటు కల్పించగా, మరో ముగ్గురు మాజీ క్రికెటర్లకు మళ్లీ అవకాశం కల్పించారు.
ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు చెందిన పలువురు క్రికెటర్లు గాయాలబారిన పడిన విషయం తెల్సిందే. గాయం కారణంగా కెప్టెన్ వెట్టోరి, జాకబ్ ఓరమ్‌లు ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఆడలేదు. ఇకపోతే జెస్సీ రైడర్, టఫీ, బ్రెండెన్ దిమాంతి, గ్రాంట్ ఎలియట్‌లు జట్టు ఎంపికలో పరిగణంలోకి తీసుకోలేదు.