వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » వన్డే సిరీస్‌లో 7-0 తేడాతో భారత్‌ను ఓడిస్తాం: బ్రెట్ లీ (Australia | India | 7-0 defeat | Lee | Mumbai | Australia | Speedster | Hosts | ODI)
Feedback Print Bookmark and Share
 
ఈనెల 25వ తేదీ నుంచి జరిగే ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా వైట్ వాష్ చేస్తుందనే నమ్మకాన్ని ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ధీమా వ్యక్తం చేశాడు. ఈ టోర్నీలో ఆతిథ్య భారత్ జట్టుకు చావుదెబ్బ తప్పదని లీ జోస్యం చెప్పాడు. భారత్‌లో జరుగనున్న వన్డే సిరీస్‌లో తమ జట్టు మంచి ప్రదర్శన కనపరుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, ఈ సిరీస్‌లో విజయం సాధించడమే కాకుండా వైట్ వాష్ చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. తాము క్రమశిక్షణాయుత క్రికెట్ ఆడితే ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను తప్పకుండా 7-0 తేడాతో కైవసం చేసుకుంటామన్నారు. తన దృష్టిలో ఏ బ్యాట్స్‌మెన్‌ లేరని, ఒకటి నుంచి పదో నంబర్ వరకు బరిలోకి దిగే బ్యాట్స్‌మెన్స్ భరతం పట్టడమే తన దృష్టి కేంద్రీకృతమై ఉంటుదన్నారు.

ప్రస్తుతం భారత్‌‌లో జరుగుతున్న ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 టోర్నీలో న్యూ సౌత్ వేల్స్ బ్లూస్ జట్టు తరపున బ్రెట్ లీ ఆడుతున్న విషయం తెల్సిందే. కాగా, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈనెల 25వ తేదీ నుంచి ఆరంభంకానుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.