ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఆస్ట్రేలియా టీ-20 జట్టు కెప్టెన్‌గా మైఖేల్ క్లార్క్ (Michael Clarke | named | Australia | new T20 captain | Ricky Ponting | Australia)
ఆస్ట్రేలియా టీ-20 జట్టు కెప్టెన్‌గా మైఖేల్ క్లార్క్
శుక్రవారం, 16 అక్టోబర్ 2009( 16:34 IST )
ఆస్ట్రేలియా ట్వంటీ-20 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మైఖేల్ క్లార్క్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ట్వంటీ-20 మ్యాచ్‌లకు ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ రికీ పాంటింగ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో క్లార్క్‌ను ఎంపిక చేసినట్టు సీఏ అధికారులు వెల్లడించారు.
అలాగే వైస్ కెప్టెన్‌గా కామెరాన్ వైట్ వైస్ కొనసాగుతారు. దీనిపై క్లార్క్ స్పందిస్తూ.. గత కొన్ని సంవత్సరాలుగా రికీ పాంటింగ్ నుంచి ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. ఈ విద్యాభ్యాసాన్ని ఇకపై కూడా కొనసాగిస్తానని చెప్పాడు.
సరికొత్త ఫార్మెట్ క్రికెట్‌లో ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉంది. మాలో ఎంతో మంది యువకులు ఉన్నారని, అయితే, వీరంతా ట్వంటీ-20 క్రికెట్‌కు చేస్తున్న సేవలను గుర్తించాలని కోరాడు. అదేసమయంలో ట్వంటీ-20 ఫార్మెట్‌లో తమ ప్రదర్శన అంత బాగాలేదని చెప్పాడు.
కాగా, వచ్చే యేడాది కరేబియన్ దీవుల్లో జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచ కప్‌పై దృష్టి సారించడమే క్లార్క్ ముందున్న ఏకైక లక్ష్యం. ఈ యేడాది జరిగిన ఈ టోర్నీలో ఆసీస్ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన విషయం తెల్సిందే.