వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ద్రవిడ్‌పై వేటు సరికాదు : అనిల్ కుంబ్లే (Cricket | News | Australia | One Day Series | India Team | Mister Dependable | Rahul Dravid)
Feedback Print Bookmark and Share
 
Kumble
FILE
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు భారత జట్టులో చోటు సంపాదించలేకపోయిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు.. తన సహచరుడు, మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే బాసటగా నిలిటాడు. ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు ఎంపిక చేసిన టీం ఇండియా జట్టులో ద్రవిడ్‌కు స్థానం కల్పించకపోవటానికి సరైన కారణమే కనిపించటం లేదని కుంబ్లే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

ఇటీవలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ.. ద్రవిడ్‌ను ఎంపిక చేయక పోవటంలో ఆంతర్యం ఏంటో అంతుబట్టకుండా ఉందని కుంబ్లే ఆరోపించాడు. రాహుల్‌ను జట్టులో కొనసాగించక పోవటానికి గల అసలు కారణాలేంటో తెలియటం లేదని.. ఇది సెలక్టర్ల నిర్ణయమే అయినప్పటికీ, చాంఫియన్స్ ట్రోఫీలో బాగా రాణించినా ద్రవిడ్‌ను పక్కన పెట్టడంలో అర్థంలేదన్నాడు.

ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్ ఫిట్‌నెస్‌తో ఉన్న కారణంగా.. అతని స్థానంలో వచ్చిన రాహుల్ ద్రవిడ్‌ను పక్కన పెట్టేసేందుకు సెలక్టర్లు నిర్ణయించుకున్నారేమోనని కుంబ్లే సందేహం వ్యక్తం చేశాడు. ఏదేమయినప్పటికీ మంచి ఆటతీరుతో ఫామ్‌లో ఉన్న ద్రవిడ్‌ను జట్టుకు ఎంపిక చేయకపోవటం ఏ మాత్రం సరికాదని అతను అసంతృప్తి వ్యక్తం చేశాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.