వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పీసీబీ సమీక్షకు యూనిస్ ఖాన్ డుమ్మా..! (Cricket | News | Champions Trophy | Pakistan Team | Captain | Younis Khan | Pakistan Cricket Board |)
Feedback Print Bookmark and Share
 
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ఆటతీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి కెప్టెన్ యూనిస్ ఖాన్ డుమ్మా కొట్టాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ ఇజాజ్ భట్ ఆధ్వర్యంలో స్థానిక గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఖాన్ గైర్హాజర్ అయ్యాడు.

అయితే పాక్ వైస్ కెప్టెన్ ఆఫ్రీదీ, కోచ్ ఇంతికాబ్ ఆలమ్, మేనేజర్ సయూద్, అసిస్టెంట్ మేనేజర్ రాణా, చీఫ్ సెలెక్టర్ ఖాసిం, ముఖ్య పరిపాలనాధికారి వసీం బారీలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. యూనిస్ గురువారమే పీసీబీ చీఫ్‌తో అన్ని విషయాలను సమగ్రంగా చర్చించాడు కాబట్టి.. ఈ సమావేశానికి రాలేకపోయాడని ఈ మేరకు బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ సందర్భంగా ఇజాజ్ భట్ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు అంచనాలకు మించి రాణించిందని.. సమీక్షలో పాల్గొన్నవారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్ గురించి కూడా చర్చించామనీ.. ఇకపై తరచుగా ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుపుతామనీ.. అవి తమ పాక్ క్రికెట్‌కు మేలు చేకూరుస్తాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.