వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » యూనిస్ అర్హత మేరకే రాజీనామా: పాక్ క్రీడా సమాఖ్య (Younis Khan| Captain| PCB| Champions Trophy| Match fixing| Cricket)
Feedback Print Bookmark and Share
 
Younis Khan
FILE
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ రాజీనామాను అతని అర్హత మేరకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిగణించాలని ఆ దేశ క్రీడా సమాఖ్య కోరింది. యూనిస్ ఖాన్ అర్హత మరియు నైపుణ్యంపై పీసీబీ పరిశీలించాలని సమాఖ్య తెలిపింది.

పాకిస్తాన్ క్రికెట్ టీంకు యూనిస్ ఖాన్ కెప్టెన్సీ, అతని సారథ్యంలో రాణించిన మ్యాచ్‌లు, విజయాపజయ వివరాలు వంటి పలు అంశాలను పరిశీలించాకే యూనిస్ రాజీనామా విషయమై పీసీబీ తగిన నిర్ణయం తీసుకోవాలని క్రీడా సమాఖ్య పేర్కొంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ టీం కెప్టెన్.. తనకు కెప్టెన్సీ పదవి వద్దని రాజీనామా లేఖను పీసీబీకి అందించిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామా లేఖపై పరిశీలన జరిపి తిరిగి యూనిస్‌కు కెప్టెన్సీ పదవిని అప్పగించే విషయమై కసరత్తులు జరుగుతున్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.