ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఐపీఎల్ 2010కి కివీస్, ఆసీస్ క్రికెటర్లు గైర్హాజరీ! (IPL 2010 | Newzealand | Australia | absence | Test Series)
వచ్చే ఏడాదిలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ 20 టోర్నీ ప్రధమార్థంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్రలు అందుబాటులో ఉండకపోవచ్చని క్రీడా వర్గాల సమాచారం. ఈ క్రికెటర్లు పాల్గొనలేకపోయినట్లయితే.. ఈ ప్రతిష్టాత్మక టోర్నీపై అధికంగా ప్రభావం పడే అవకాశం ఉంది.
ఐపీఎల్ టోర్నీ వచ్చే ఏడాదిలో మార్చి 12 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు జరిగేలా షెడ్యూల్ నిర్ణయించారు. కానీ.. అదే సమయంలో.. ఐదు వారాల సుదీర్ఘ పర్యటన కోసం న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియా పర్యటించనుంది. దీని కారణంగా అనేక మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు.
న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్ట్ సిరీస్‌లు మార్చి 31వ తేదీ వరకు జరుగుతాయి. ఐపీఎల్ గ్రూప్ స్టేజీలు ఏప్రిల్ 19వ తేదీ వరకు కొనసాగుతాయి. దీంతో ఐపీఎల్‌లో కివీస్, ఆసీస్ ఆటగాళ్లు చాలా వరకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అదలా ఉంచితే.. భద్రత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్ రెండో ఎడిషన్ దక్షిణాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ, వచ్చే ఏడాది మాత్రం యథావిధిగా.. ఐపీఎల్ మూడో ఎడిషన్‌ను భారత్‌లోనే నిర్వహించనున్నారు.