ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » 2011 ప్రపంచ కప్ వరకు పాక్ కెప్టెన్ యూనిస్: పీసీబీ (Karachi | Ejaz Bhat | PCB | Younus Khan | skipper | 2011 World Cup | Pakistan)
వచ్చే 2011 ప్రపంచ కప్ వరకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ప్రస్తుత కెప్టెన్ యూనిస్ ఖాన్ కొనసాగుతాడని ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. కెప్టెన్సీ నుంచి యూనిస్‌ను మార్చే ప్రసక్తే లేదని పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ భట్ సోమవారం తేల్చి చెప్పారు.
దీనిపై ఆయన లాహోర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ దేశ క్రికెట్ బోర్డులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ కెప్టెన్ అయినా వచ్చే ప్రపంచ కప్ వరకు కెప్టెన్‌గా కొనసాగాలని కోరుకుంటాడు. ఆందువల్ల యూనిస్‌ను మార్చకూడదని తాము నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
కాగా, తనపై వచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కలత చెందిన యూనిస్ ఖాన్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈ రాజీనామా లేఖను పీసీబీ తిరస్కరించింది. గత కొన్ని నెలలుగా తమ జట్టు బాగా రాణిస్తోంది. యూనిస్ వచ్చే ప్రపంచ కప్ వరకు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే అతనే కెప్టెన్‌గా ఉంటాని ఇజాజ్ భట్ వివరణ ఇచ్చారు.
ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఇవి పాక్ బోర్డును కుదిపేశాయి. ఫలితంగా యూనిస్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశాడు.