వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » భారత్-శ్రీలంక వన్డేకు ఆతిథ్యం ఇవ్వనున్న కటక్ (Cuttack | gears up | host | Sri lanka | India | ODI | Barabati |Bhuvaneswar)
Feedback Print Bookmark and Share
 
భారత్-శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య జరుగనున్న వన్డే డే అండ్ నైట్ మ్యాచ్‌కు కటక్‌లోని బారాబతి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఒరిస్సా క్రికెట్ అసోసియేషన్ అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు.

ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు 26 కిలోమీటర్ల దూరంలో బారాబతి స్టేడియం ఉంది. డిసెంబరు 21వ తేదీన జరిగే మ్యాచ్ 16వ అంతర్జాతీయ డే అండ్ నేట్ మ్యాచ్ అని ఓసీఓ సెక్రటరీ ఆశీర్వాద్ బెహ్రరా తెలిపారు.

దీనిపై ఆయన సోమవారం మాట్లాడుతూ.. స్టేడియంలో సీటింగ్ కెపాసిటీని కూడా 35 నుంచి 45 వేలకు పెంచుతున్నామని అందువల్ల ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించవచ్చన్నారు. అంతేకాకుండా స్టేడియంలో తొలిసారి శీతలీకరణ కార్పొరేట్ బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఇందులో 800 మంది కూర్చొని తిలకించే సౌకర్యం ఉందన్నారు.

స్టేడియానికి వచ్చే వాహనాల రద్దీని తగ్గించేందుకు మూడు పార్కింగ్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత యేడాది ఒక పార్కింగ్ స్థలం మాత్రమే ఉన్నదని ఆయన గుర్తు చేశారు. క్రికెట్ మ్యాచ్‌ కోసం వచ్చే ఆటగాళ్లు, మ్యాచ్ రెఫరీలు, ఇతర అధికారులకు భువనేశ్వర్‌లోని మేఫైర్ లగూన్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం హోటల్‌ను ఇప్పటికే రిజర్వు చేశామన్నారు.

వన్డే మ్యాచ్ నిర్వహణ కోసం ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తుందన్నారు. మ్యాచ్ నిర్వహణ, భద్రత, ఇతర అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరేందుకు ఈ కమిటీ త్వరలోనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలువనున్నట్టు ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.