వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాక్ ట్వంటీ-20 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఆఫ్రిది: ఇజాజ్ భట్ (Pakistan | Twenyt-20 | Captain | Afridi | Ejaz Bhat | PCB | Westindies | ICC)
Feedback Print Bookmark and Share
 
పాకిస్థాన్ ట్వంటీ-20 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా షాహిద్ ఆఫ్రిది కొనసాగుతాడని ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ తెలిపారు. వచ్చే యేడాది కరేబియన్ గడ్డపై జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచ కప్ వరకు షాహిద్ ఆఫ్రిది జట్టుకు నాయకత్వం వహిస్తాడని భట్ తెలిపారు. దక్షిణాఫ్రికా గడ్డపై జరగిన తొలి ట్వంటీ-20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్ యూనిస్ ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించారు.

యూనిస్ స్థానంలో ఆఫ్రిదిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ట్వంటీ-20 టోర్నీలో పాక్ జట్టు ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆఫ్రిదిని మార్చే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు వచ్చాయి. వీటిపై భట్ స్పందించారు. వచ్చే యేడాది జరిగే ట్వంటీ-20 ప్రపంచ కప్ వరకు ఆఫ్రిది కెప్టెన్‌గా కొనసాగుతారని చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.