వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్: ఆసిఫ్‌కు చుక్కెదురు! (Asif | barred entry | UAE | New Zealand | ODI | Pakistan | Ejaz Bhat | PCB)
Feedback Print Bookmark and Share
 
త్వరలో న్యూజిలాండ్‌ జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్‌ కోసం ప్రకటించే జట్టులో పాకిస్థాన్ పేస్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్‌కు చోటు కల్పించబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ తేల్చి చెప్పారు. మత్తుపదార్థాలు కలిగివున్నందున ఆసిఫ్‌కు యూఏఈలో ప్రవేశం లేదన్నారు.

భారత్‌లో జరిగిన ఐపీఎల్ తొలి టోర్నీలో పాల్గొన్న ఆసిఫ్ తిరిగి స్వదేశానికి వెళుతూ దుయాబ్‌లో పోలీసులకు చిక్కిన విషయం తెల్సిందే. మత్తు పదార్థాలు కలిగి ఉన్నందుకుగాను నాలుగు రోజుల పాటు నిర్భంధించిన పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో త్వరలో యూఏఈలో న్యూజిలాండ్ జట్టుతో వన్డే సిరీస్ జరుగనుంది. ఇందుకోసం ప్రకటించే జట్టులో అసిఫ్‌కు చోటు కల్పించబోమని భట్ తేల్చి చెప్పారు. అసిఫ్ యూఏఈకి వెళ్లలేడని, అందువల్ల వన్డే సిరీస్‌లో ఆసిఫ్ ఆడలేరని చెప్పారు. ఇరు దేశాల మధ్య వన్డే సిరీస్ వచ్చే నెల 3 నుంచి 13వ తేదీ వరకు జరుగనుంది. ఈ సిరీస్‌కు దుబాయ్, అబుదాబీలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.