వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » కెప్టెన్ యూనిస్ ఖాన్‌తో విభేదాలు లేవు: ఆఫ్రిది (No difference | opinion | Younus | Afridi | Karachi | PCB | Ejaz Bhat)
Feedback Print Bookmark and Share
 
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్‌తో తనకెలాంటి విభేదాలు లేవని ఆ దేశ ట్వంటీ-20 క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది స్పష్టం చేశారు. దేశ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పాడు. జాతీయ క్రికెట్ జట్టు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని యూనిస్‌ ఖాన్‌ను తిరిగి కెప్టెన్‌గా కొనసాగించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుందని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

అంతేకాకుండా, తనకు యూనిస్‌కు మధ్య విభేదాలు పొడచూపినట్టు స్వదేశీ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఆఫ్రిది తీవ్రంగా ఖండించారు. మీడియాలో లేనిపోని ఊహాగాన కథనాలు వస్తున్నాయన్నారు. అలాగే తనకు యూనిస్‌కు మధ్య విభేదాలు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కెప్టెన్ యూనిస్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయి. జట్టులోని ఒక ఆటగాడిగా కెప్టెన్‌కు పూర్తిస్థాయి మద్దతు ఇస్తానని చెప్పాడు. తనకు లభించే ప్రతి అవకాశంతో తన దేశ క్రికెట్ జట్టు కోసం మనస్ఫూర్తిగా మైదానంలో ఆడుతానని ఆఫ్రిది స్పష్టం చేశాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.