వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు వెల్లడి (Pakistan | Yunis Khan | PCB | Misbha ul Huk | Afridi | Kiwis | Oneday)
Feedback Print Bookmark and Share
 
వచ్చే నెల మూడో తేదీ నుంచి న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే, టెస్టు సిరీస్‌ల పాకిస్థాన్ క్రికెట్ జట్టును ఆ దేశ సెలక్టర్లు గురువారం వెల్లడించారు. ఇందులో సీనియర్ బ్యాట్స్‌మెన్ మిస్బావుల్ హక్‌పై వేటు వేశారు. కెప్టెన్ యూనిస్ ఖాన్‌తో పొసగని కారణంగానే మిస్బాపై వేటు వేసినట్టు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే 2011 ప్రపంచ కప్ వరకు కెప్టెన్‌గా కొనసాగేలా పీసీబీ నుంచి హామీ పొందిన యూనిస్ వన్డేలకు, టెస్టులకు, ట్వంటీ-20కి ప్రకటించిన జట్టులో కీలక పాత్ర పోషించాడు. జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

వన్డే జట్టు.. యూనిస్ ఖాన్ (కెప్టెన్), ఆఫ్రిది, సల్మాన్ భట్, పర్హాత్, లతీఫ్, యూసుఫ్, మాలిక్, ఉమర్ అక్మల్, కమ్రాన్ అక్మల్, రజాక్, రాణా నవీద్, గుల్, అజ్మల్, అమిర్, రియాజ్, ఇఫ్తికార్.

టెస్టు జట్టు... యూనిస్ ఖాన్ (కెప్టెన్), భట్, మంజూర్, పర్హాత్, యూసుఫ్, షోయబ్ మాలిక్, ఆలమ్, ఇక్బాల్, కనేరియా, కమ్రాన్ అక్మల్, అజ్మల్, అరాఫత్, అసిఫ్, గుల్, అమిర్, రవూఫ్, ఉమర్, అహ్మద్.

ట్వంటీ-20 జట్టు... ఆఫ్రిది (కెప్టెన్), ఖాలిద్ లతీఫ్, నజీర్, ఉమర్ అక్మల్, మాలిక్, కమ్రాన్ అక్మల్, రజాక్, రాణా నవీద్, అమిర్, రవూ ఇఫ్తీకార్, అజ్మల్, ఫర్హాత్, ఫవాద్ ఆలమ్, తన్వీర్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.