వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » వచ్చే వారంలో భారత్‌కు రానున్న పీసీబీ ఛైర్మన్ (Karachi | PCB | Ejaz Bhat | Cricket | India | Pakistan | Bilateral Series | IPL)
Feedback Print Bookmark and Share
 
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ వచ్చే వారంలో భారత్‌కు రానున్నారు. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలకు పూర్తిగా బ్రేక్ పడింది. వీటిని తిరిగి పునరుద్ధరించాలన్న బలమైన ఆకాంక్షతో ఆయన న్యూఢిల్లీ పర్యటనను తలపెట్టారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు ముందుకు రావాలన్న ప్రతిపాదనను ఆయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముందు ఉంచనున్నారు.

దీనిపై పీసీబీ వర్గాలు స్పందిస్తూ.. న్యూఢిల్లీకి వచ్చే భట్.. పాకిస్థాన్ హైకమిషనర్‌తో తొలుత భేటీ అవుతారు. ఆ తర్వాత బీసీసీఐ అధికారులతో ఆ పిమ్మట ప్రభుత్వ అధికారులతో సమావేశమవుతారు. పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఆ వర్గాలు నిరాకరించాయి.

వచ్చే యేడాది జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం తటస్థ వేదికలపై ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని లేదా.. ఐపీఎల్ టోర్నీలో పాక్ ఆటగాళ్లు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ ప్రభుత్వాన్ని కోరనుంది.

ఇరు దేశాల క్రికెట్ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణ ఆవశ్యకతను వెల్లడించే నిమిత్తం ఇజాజ్ భట్ భారత్‌కు వస్తున్నారు. అయితే, ఆయన పర్యటన వల్ల విజయవంతం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ముంబై దాడులకు సూత్రధారులుగా భావిస్తున్న వారిపై పాక్ పాలకులు చర్యలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడమే ఇందుకు నిదర్శనం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.