వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » విధుల నుంచి తప్పుకున్న కివీస్ క్రికెట్ కోచ్ మోల్స్ (New Zealand | coach | quits | player criticism | Andy Moles | John Bracewell)
Feedback Print Bookmark and Share
 
జట్టులోని సీనియర్ ఆటగాళ్లు విమర్శలు చేయడంతో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి ఆండీ మోల్స్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని కివీస్ క్రికెట్ బోర్డు అధికారులు శనివారం ధృవీకరించారు. కోచ్‌తో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో కోచ్‌పై పలువురు ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు. ఇవి తారా స్థాయికి చేరుకోవడం వల్ల ఆయన్ను తొలగించాలని సీనియర్ ఆటగాళ్లు విజ్ఞప్తి చేశారు.

ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటన, ఛాంపియన్స్ ట్రోఫీ‌లలో జట్టు ప్రదర్శనంపై సమీక్ష నిర్వహించగా, జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మోల్స్ తప్పుకున్నారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై కివీస్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జస్టిన్ వాగన్ స్పందిస్తూ.. మోల్స్ స్థానంలో తక్షణం ఎవరిని నియమించలేదన్నారు.

గత యేడాది నవంబరులో ఇంగ్లీష్ సంతతికి చెందిన మోల్స్‌ను జాన్ బ్రాస్‌వెల్ స్థానంలో కివీస్ బోర్డు నియమించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈయన కాంట్రాక్టు వచ్చే 2011 ప్రపంచ కప్ వరకు ఉంది. అయితే, ఏడాది కూడా పూర్తికాకముందే మోల్స్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.