ప్రముఖ పాక్ క్రికెట్ క్రీడాకారుడు వసీం అక్రమ్ సతీమణి హుమా చెన్నైలో తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ ట్యూమర్‌తో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హుమా ఆదివారం కన్నుమూశారు.
కొద్దిరోజుల క్రితం హుమాను సింగపూర్‌లో వైద్యం పొందాల్సిందిగా పాకిస్థానీ డాక్టర్లు సూచించారు. దీనికోసం సింగపూర్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో వెళుతున్న ఆమె గుండెపోటుకు గురయ్యారు. దీంతో స్థానిక అపోలోలో ఆమెను చికిత్స నిమిత్తం చేర్చారు.
ఈ నేపథ్యంలో.. రెండు రోజుల హుమా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెన్నై ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అంతేగాకుండా.. హుమా కిడ్నీ కూడా చెడిపోయినందున డయాలసిస్ నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
వెంటిలేటర్‌పై స్థిమితంలేని పరిస్థితిలో ఉన్న హుమా ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం కన్నుమూసిందని డాక్టర్లు చెప్పారు.