ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » శ్రీశాంత్.. ప్రవర్తన మార్చుకో: కేసీఏ హెచ్చరిక (Srisanth | Kerala Cricket | Bowler | KCA | BCCI | Team India | Dhoni)
భారత క్రికెట్‌లో నిరంతరం వివాదాస్పద క్రికెటర్‌గా పేరుగడించిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. మైదానంలో విపరీతంగా ప్రవరిస్తూ, జట్టు నియమనిబంధనలను ఉల్లంఘిస్తూ బోర్డు ఆగ్రహాన్ని చవిచూస్తుంటాడు. అయితే, ఇదే తరహాలో కేరళ క్రికెట్ అసోసియేషన్ శ్రీశాంత్‌ను హెచ్చరించింది. ఇకపై ప్రవర్తన మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పందంటూ హెచ్చరిస్తూనే కేరళ జట్టు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది.
దీనిపై కేసీఏ ఛైర్మన్ డి.గోపకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఏకైక క్రికెటర్ శ్రీశాంత్ కావడం వల్ల అతనిపై కఠిన చర్య తీసుకోలేక పోతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, భారత జట్టులో రాష్ట్రం తరపున స్థానం దక్కించుకునే క్రికెటర్ శ్రీశాంత్ అని గుర్తు చేశారు. ఈ విషయంలో శ్రీశాంత్‌కు తమ మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పారు.
అయితే అతని ప్రవర్తన మార్చుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నట్టు చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కారాదని కూడా సూచించామని తెలిపారు. శిక్షణ శిబిరంలో పాల్గొనే శ్రీశాంత్ కారణాలు లేకుండా బయటకు వెళ్లరాదని కూడా సూచించారు.