ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » నాగ్‌పూర్ వన్డేకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు! (Tight security | India | Australia | ODI | Nagpur | Jamtha | Vidarbha | Second ODI)
ఏడు వన్డేల హీరో హోండా కప్ సిరీస్‌లో భాగంగా బుధవారం రెండో వన్డే నాగ్‌పూర్‌లో జరుగనుంది. డే అండ్ నైట్ సమరంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిపై నాగ్‌పూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) సురీందర్ కుమార్, విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) అధ్యక్షుడు సుధీర్ దబీర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నాగ్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేడియం ఉందన్నారు.
భారత్-ఆస్ట్రేలియాలు తలపడుతున్న ఈ మ్యాచ్‌కు గట్టి బందోబస్తును కల్పించినట్టు చెప్పారు. ప్రధానంగా డే అండ్ నైట్‌గా జరుగుతున్నందున మంగళవారం నుంచి నగరంలో భద్రతా బలగాలను మొహరించి, స్టేడియం పరిసర ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
భద్రతలో నిమగ్నమైవున్న వారికి వాకీ టాకీలు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్, వెహికల్ మిర్రర్, నైట్ విజన్ డివైసెస్ తదితర అధునాతన పరికరాలను అందజేసినట్టు చెప్పారు. స్టేడియంలో పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను అమర్చినట్టు తెలిపారు.
మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా, ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. నాగ్‌పూర్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో జమతాలో కొత్తగా నిర్మించిన వీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ స్టేడియంలో జరుగుతున్న తొలి డై అండ్ నైట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.