వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » కోచ్ లేకుండానే పాక్ పర్యటనకు పయనమైన కివీస్ (Coachless | New Zealand | Gulf | Pakistan | Vettori | ODI | T-20 | Cricket)
Feedback Print Bookmark and Share
 
ఛాంపియన్స్ ట్రోపీ-2009 రన్నరప్ న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్‌, వైస్ కెప్టెన్ లేకుండా పాకిస్థాన్ పర్యటనకు బయలుదేరింది. ఈ పర్యటనలో కివీస్ జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లను తటస్థ వేదికలైన అబుదాబీ, యూఏఈలలో ఆడనుంది.

జట్టు కెప్టెన్‌గా చక్కగా పాత్ర పోషిస్తున్న డేనియల్ వెట్టోరీయే ఈ పర్యటనలో జట్టు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇందుకోసం వెల్లింగ్టన్ నుంచి కివీస్ బోర్డు అబుదాబీకి బయలుదేరింది. వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన బ్రెండెన్ మెక్‌కల్లమ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే.

దీంతో అటు కెప్టెన్, వైస్ కెప్టెన్‌ విధులతో పాటు.. జట్టు కోచ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్వదేశానికి చేరుకున్న కివీస్ జట్టు కోచ్‌పై క్రికెటర్లు పలు రకాల విమర్శలు చేశారు. ముఖ్యంగా పదవి నుంచి తొలగించాలని కోరారు. దీంతో కోచ్ మోల్స్ స్వచ్ఛంధంగా తప్పుకున్నారు.

జట్టు వివరాలు.. డేనియల్ వెట్టోరి, షేన్ బాండ్, బ్రూమ్, ఇయాన్ బట్లర్, జేమ్స్ ఫ్రాంక్లిన్, గుప్తిల్, మెక్‌కల్లమ్, నాథన్ మెక్‌కల్లమ్, మిల్స్, జాకబ్ ఓరమ్, రెడ్‌మాండ్, టిమ్ సౌథీ, స్కాట్ స్టైరిష్, రాస్ టేలర్, వాట్లింగ్‌.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.