వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » నాగ్‌పూర్ వన్డే: సెంచరీతో అదరగొట్టిన జార్ఖండ్ డైనమెట్ (Nagpure | Dhoni | Suresh Raina | Australia | Score | Cricket | India)
Feedback Print Bookmark and Share
 
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. తన వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టు భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డాడు. 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు రెండు సిక్స్‌లు ఉన్నాయి. తన వ్యక్తిగత స్కోరు 90 పరుగుల మీద ఉండగా ధోనీ సాహసం చేసి సిక్స్ కొట్టాడు. దీంతో స్కోరు ఒక్కసారి 96కు చేరుకుంది. ఆ తర్వాత మరో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సురేష్ రైనా కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 354 పరుగుల భారీ స్కోరు చేసింది.

అంతకుముందు భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (40) మెరుగు ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ సచిన్ (4) పరుగులకే అవుట్ అయినప్పటికీ.. గంభీర్‌తో సెహ్వాగ్ తన మెరుపు వేగాన్ని కొనసాగించాడు. సెహ్వాగ్ అవుట్ అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్ (23) భారీ షాట్లతో ఆడారు. యూవీ అవుట్ అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ.. గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

గంభీర్-ధోనీ కలిసి నాలుగో వికెట్‌కు 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన సురేష్ రైనా.. ధోనీలు ఐదో వికెట్‌కు 136 భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ధోనీ, రైనాలు వెంటవెంటనే అవుట్ అయ్యారు. నిర్ణీత యాభై ఓవర్లు ముగిసే సయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది.

ఇదిలావుండగా, ఆస్ట్రేలియాపై భారత్ చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు 2001లో బెంగుళూరులో భారత్ చేసిన 315 పరుగులు మాత్రమే అత్యధిక స్కోరుగా ఉంది. అలాగే, ఆస్ట్రేలియా జట్టుపై కెప్టెన్‌గా ధోనీ కూడా అత్యధికంగా 124 పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. తొలుత గంభీర్‌తో కలసి, ఆ తర్వాత రైనాతో కలిసి ధోనీ కీలకమైన ఇన్నింగ్స్‌ నిర్మించాడు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు ముంగిట భారత్ భారీ స్కోరు ఉంచింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.