ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ!
(Australia | Cricket | Wicket Keeper | paine | Manou | India | Delhi | ODI)
ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లు గాయాలబారిన పడి సతమతవుతున్న ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్ పయనీ ఏకంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో దక్షిణ ఆస్ట్రేలియా జట్టు వికెట్ కీపర్, కెప్టెన్ గ్రహం మనౌను ఎంపిక చేశారు.
రెండో వన్డేలో పేస్ బౌలర్ పీటర్ సిడెల్ వేసిన బౌన్సర్‌ను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నించిన పయనీకి ఎడం చేతి వేలికి గాయమైంది. ఫలితంగా ఐదు వన్డేలకు దూరమయ్యాడు. శనివారం న్యూఢిల్లీలో జరిగే మూడు వన్డేకు పయనీ స్థానంలో ఎంపిక చేసిన గ్రహం మనౌ అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
దీంతో 30 సంవత్సరాల గ్రహం మనౌ తొలిసారి అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా జాతీయ సెలక్షన్ ప్యానెల్ ఛైర్మన్ ఆండ్రూ హిల్డిచ్ తెలిపారు. ఈ సిరీస్ కోసం మనౌ గురువారం రాత్రి ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు బయలుదేరినట్టు ఆయన తెలిపారు.
ఏడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. తొలి వన్డేలో ఆసీస్ జట్టు విజయం సాధించగా, రెండో వన్డేలో టీమ్ ఇండియా జయభేరీ మోగించింది. కాగా, ఆసీస్ జట్టు రెగ్యులర్ బౌలర్ బ్రాడ్ హిడిన్ గాయంతో బాధపడుతూ ఇటీవలే కోలుకున్నాడు. అయినప్పటికీ.. విశ్రాంతి ఇవ్వాలన్న కారణంతో భారత పర్యటనకు హిడిన్‌ను ఎంపిక చేయలేదు.