వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ రేసులో జాన్ రైట్! (Ackland | New Zealand | John Wright | Coach | Black Caps | Fleming)
Feedback Print Bookmark and Share
 
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ రేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ జాన్ రైట్ చేరారు. తమ దేశ జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే, తుది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి వుంది.

ప్రస్తుత ఆ జట్టు కోచ్ లేకుండానే పాకిస్థాన్‌తో జరుగనున్న వన్డే, ట్వంటీ-20, టెస్టు సిరీస్‌ కోసం అబుదాబీకి చేరుకుంది. ఆ జట్టు కెప్టెన్, కోచ్ బాధ్యతలను కెప్టెన్ డేనియల్ వెట్టోరి పోషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జట్టు కోచ్‌గా పలువురు పేర్లను కివీస్ క్రికెట్ బోర్డు పరిశీలిస్తోంది. వీరిలో జాన్ రైట్‌తో పాటు.. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ స్టీవ్ రిక్సన్‌తో పాటు మరో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు కూడా ఉన్నారు. భారత జట్టుకు కోచ్‌‌గా ఉన్న సమయంలో జాన్ రైట్ అద్భుత ఫలితాలను చూపించిన విషయం తెల్సిందే. భారత జట్టు భాగ్య రూపురేఖలనే మార్చి వేశారు.

అయితే, కివీస్ కోచ్ పదవికి రాజీనామా చేసిన మోల్స్ స్థానంలో కొత్తకోచ్‌ను నియమించేందుకు న్యూజిలాండ్ బోర్డు తొందర పడటం లేదు. కెప్టెన్ వెట్టోరి రెండు రకాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకాన్ని కివీస్ బోర్డు పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.