వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » వచ్చే వారంలో గేల్ కెప్టెన్సీపై నిర్ణయం! (Chris Gayle | Westindies | Cricket Board | Australia tour | Daren Ganga)
Feedback Print Bookmark and Share
 
వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్‌‌గా క్రిస్ గేల్‌ను కొనసాగించాలా? వద్దా? అనే విషయాన్ని వచ్చే వారంలో విండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించనుంది. త్వరలో విండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జట్టును ఎంచుకోవలసి ఉంది. అయితే వేతనాలు చెల్లించకుండా... మ్యాచ్‌లు ఆడిస్తున్నారంటూ.. విండీస్ క్రికెట్ ఆటగాళ్ల సంఘం గతంలతిరుగుబాటు బావుటా ఎగరవేసింది.

ఇది పట్టని విండీస్ బోర్డు ఆగ్రహించింది. దీనికి ప్రతిగా బంగ్లాతో జరిగిన వన్డే, టెస్ట్ సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీలో సైతం విండీస్ బోర్డు ద్వితీయ శ్రేణి జట్టును ఆడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం విండీస్ బోర్డు, ఆటగాళ్ల సంఘం మధ్య ఇటీవలే రాజీ కుదిరింది.

జాతీయ స్థాయి జట్టుకు సారథ్య బాధ్యతల పట్ల తనకు ఆసక్తి లేదని గతంలో గేల్ ప్రకటించాడు. అయితే ఆసీస్‌ పర్యటన సందర్భంగా.. తాను కెప్టెన్సీకి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే గేల్ విలేకరులకు చెప్పడం గమనార్హం. అదలా ఉంచితే.. మరికొద్ది రోజుల్లో విండీస్ బోర్డు సెలెక్టర్లు సమావేశం కానున్నారు.

ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించి.. బోర్డుకు తమ సిఫార్సులను చేయనున్నట్లు డబ్ల్యూఐసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎర్నెస్ట్ హిలైర్ తెలిపారు. బోర్డుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆటగాళ్లను ఆసీస్ పర్యటనకు తిరిగి జట్టులోకి తీసుకునేందుకు బోర్డు అనుమతిచ్చినట్లు ఆయన వివరించారు.

దీంతో సీనియర్ ఆటగాళ్లందరూ.. ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతుండగా.. ఈ నేపథ్యంలో గేల్ కెప్టెన్సీ సందిగ్ధంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ట్వంటీ 20 ఛాంపియన్స్ లీగ్‌లో ట్రినిడాడ్ అండ్ టుబాగో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లిన కెప్టెన్ డారెన్ గంగా.. గేల్‌కు గట్టి పోటీదారుగా నిలుస్తున్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.