ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ట్వంటీ-20 ప్రపంచకప్: ర్యాంకింగ్స్‌లో భారత్‌కు ఆరోస్థానం (Cricket| Twenty-20 World Cup| Rankings| India| Pakistan| Srilanka| South Africa)
కరేబియన్ దీవుల్లో వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ ర్యాంకింగ్స్ జాబితాలో భారత్‌కు ఆరో స్థానం లభించింది. 2010లో జరిగే ప్రపంచ కప్ 20-20లో భాగంగా, భారత్ తొలి మ్యాచ్‌ను మే ఒకటో తేదీ ఆడుతుంది.
'సి' విభాగంలో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా మరియు ఓ కొత్త జట్టుతో బరిలోకి దిగనుంది. ఇంగ్లాండ్‌లో జరిగిన ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన పాకిస్తాన్.. ఈ 20-20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తర్వాతి స్థానాలను శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు సొంతం చేసుకున్నాయి.
నాలుగో స్థానంలో వెస్టిండీస్, ఐదో స్థానంలో ఇంగ్లాండ్ జట్లు నిలవగా, ఆరో స్థానాన్ని భారత్ దక్కించుకుంది. ఇకపోతే.. వచ్చే ఏడాది జరిగే లూయీస్ ప్రపంచకప్ 20-20లో భారత్ తన ప్రారంభ మ్యాచ్‌ను 20-20కి అర్హత సాధించేందుకు బరిలోకి దిగనున్న ఓ నూతన జట్టుతో బరిలోకి దిగుతుంది.