ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ప్రాక్టీసు సౌకర్యాలపై విమర్శలు చేసిన పాంటింగ్ (Ricky Pointing | Practice facilities | Firozshah Kotla stadium | Curator | Dhoni)
రెండు వన్డేలో ఘోరపరాజయం నేపథ్యంలో.. మూడో వన్డేకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తమకు కల్పించిన ప్రాక్టీసు సౌకర్యాలపై విమర్శలు గుప్పించాడు. న్యూఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో తాము ప్రాక్టీసుకు వచ్చే సమయానికి క్యూరేటర్ పిచ్‌పై నీళ్లు తడిపి ఉంచారని.. దీంతో తమ ప్రాక్టీసు ఆగిపోయిందని ఆరోపించాడు.
న్యూఢిల్లీలో పాంటింగ్ విలేకరులతో మాట్లాడుతూ, ఆసీస్ జట్టుకు ఉదయం ప్రాక్టీసు సెషన్ ఉంటుంది. అలాగే భారత్‌కు మధ్యాహ్నం సమయంలో ప్రాక్టీసు సెషన్ ఉంటుంది. తాము ఉదయం తొమ్మిది గంటలకు మ్యాచ్‌కు వస్తామని తెలిసి కూడా క్యూరేటర్ సరిగ్గా మేము వచ్చే కొద్దిసేపటికే ముందే పిచ్‌పై నీళ్లు చల్లాడని పాంటింగ్ వాపోయాడు.
భారత జట్టుకు అనుకూలంగా.. క్యూరేటర్ వ్యవహరిస్తున్నట్లు పాంటింగ్ ఆరోపణ చేశాడు. ప్రాక్టీసు పిచ్ చూడగానే తాము తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిపాడు. కాగా.. నాగపూర్ వన్డేలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నోటికి పని చెప్పిన కంగారూలు.. ఇప్పుడు తాజాగా ప్రాక్టీసు సౌకర్యాలపై విమర్శలు చేస్తూ.. మానసిక యుద్ధాన్ని ఆరంభించారని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
అదలా ఉంచితే... పాంటింగ్ విమర్శలపై స్పందించిన ధోనీ విలేకరులతో మాట్లాడుతూ, ఒక రోజు ప్రాక్టీసు కోల్పోయినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదన్నాడు. తేడా కూడా పెద్దగా ఏమీ ఉండదన్నాడు. ఆసీస్ జట్టు విధించిన సమయం కన్నా ముందే మైదానానికి చేరుకుందన్నాడు.