వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మూడో వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాంటింగ్ సేన (Third one day | Toss | Australia | India | Pointing | Dhoni | Bating)
Feedback Print Bookmark and Share
 
సిరీస్ సమం అయింది. ఇక నుంచి ఎవరు రాణిస్తే... వారిదే పై చేయి. భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో వన్డే న్యూఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రికీ పాంటింగ్ (11), షేన్ వాట్సన్ (9)లు ఇన్నింగ్స్ ఆరంభించారు.

గాయాలతో బ్రెట్‌లీ, టిమ్ పైనీలు ఈ మ్యాచ్‌లో అందుబాటులో లేకపోయినప్పటికీ... ఏ మాత్రం తగ్గకుండా.. ఆత్మవిశ్వాసంతో ఆసీస్ బరిలోకి దిగింది. అయితే.. నాగపూర్ వన్డేలో ఆసీస్‌పై భారీ తేడాతో విజయం సాధించిన భారత్ కూడా అమితమైన విశ్వాసంతో బౌలింగ్ చేపట్టింది. పిచ్ క్యూరేటర్ ఇచ్చిన నివేదిక ప్రకారం... తొలుత బ్యాటింగ్ చేపట్టే జట్టుకు పరుగులు వస్తాయి.

అయితే.. భారత బ్యాటింగ్ లైనప్.. ఎలాంటి బౌలంగ్‌నైనా ఛేదించేలా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఒక రకంగా కీలకమని చెప్పాలి. ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు తప్పదు. కడపటి వార్తలందే సరికి ఆసీస్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 20 పరుగులు చేసింది. ఆశిష్ నెహ్రా, ప్రవీణ్ కుమార్‌లు పేస్ బౌలింగ్‌ను పంచుకుంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.