ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాంటింగ్, వైట్ అవుట్: ఆస్ట్రేలియా 200/5 (Cricket| India| Australia| Third One Day| New Delhi| Ponting| White| Dhoni| Raina| Bajji)
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోన్న మూడో వన్డేలో పాంటింగ్ సేన తడబడుతోంది. ధోనీ సేన బౌలర్లకు తగిన విధంగా కంగారూలు ఆడుతున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాంటింగ్ సేన 46.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేసింది.
పిచ్‌కు తగినట్లు ఆడిన కంగారూల కెప్టెన్ రికీ పాంటింగ్ 92 పరుగుల్లో నాలుగు ఫోర్లతో 59 పరుగులు సాధించి, జడేజా బౌలింగ్‌లో ఎల్.బి.డబ్ల్యూ.యూతో పెవిలియన్ ముఖం పట్టాడు.
తర్వాత బరిలోకి దిగిన వైట్ కేవలం ఒక పరుగు కూడా చేయకుండా డ కౌట్ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ మైక్ హస్సీ (76 బంతుల్లో, 3 ఫోర్లతో 70 పరుగులు) మాత్రం టీం ఇండియా బౌలర్ల బౌలింగ్‌కు అనుగుణంగా ఆడుతూ క్రీజులో ఉన్నాడు.
తర్వాత బరిలోకి దిగిన వోగ్స్ (17)ను భజ్జీ బౌలింగ్‌లో, హెన్రిక్స్ (12) జడేజా బౌలింగ్‌లో ఇంటిముఖం పట్టారు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు 46.3 ఓవర్లలో 200 పరుగులు సాధించడమే కష్టతరమైంది. ప్రస్తుతం మైక్ హస్సీ (71), జాన్సన్ (6)లు క్రీజులో ఉన్నారు.