ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » బెస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. అఫ్రిది: బాయ్‌కాట్ (Shahid Afridi | Geoff Boycott | best bowling all rounder | Pakistan | Newzealand)
ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ ఆల్‌రౌండర్ పాకిస్థాన్ క్రికెటర్ షాహిది అఫ్రిది అని మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ జెఫ్ బాయ్‌కాట్ ప్రశంసించాడు. అయితే బ్యాటింగ్‌లో అతను కొంత ఓర్పుగా క్రీజులో నిలబడాల్సిన అవసరం ఉందని బాయ్‌కాట్ సూచించాడు.
బాయ్‌కాట్ తన అధికారిక వెబ్‌సైట్‌లో మాట్లాడుతూ మరింత మెరుగైన ప్రదర్శన కనబరచడం అఫ్రిది పెద్ద కష్టమేమీ కాబోదన్నాడు. అయితే ఎవరైనా బౌలర్ ఎదురుదాడి చేస్తే.. అఫ్రిది తడబడుతున్నాడని బాయ్‌కాట్ తెలిపాడు. మరోవైపు అనేక మంది బ్యాట్స్‌మన్‌లను తన స్పిన్ మాయాజాలంతో అఫ్రిది అవలీలగా పెవిలియన్ దారి పట్టిస్తున్నాడన్నాడు.
మణికట్టు మాయాజాలంతో అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని బాయ్‌కాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, యూఏఈలో మంగళవారం నుంచి పాక్, న్యూజిలాండ్‌ల మధ్య ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం వస్తున్న కామెంటరీ బృందంలో ఒకడిగా బాయ్‌కాట్ ఉన్నాడు.
గతంలో పాక్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన బాయ్‌కాట్.. అఫ్రిది బ్యాటింగ్ గురించి అడిగినపుడు మిశ్రమంగా స్పందించాడు. అఫ్రిది బ్యాటింగ్‌పై మరింత శ్రద్ధ చూపాలని.. ఓర్పుతో సరైన అవకాశం కోసం ఎదురుచూడకుండా.. అనేక సార్లు అతని బ్యాటింగ్ తీరు ఉంటుందన్నాడు. అయితే బౌలింగ్‌లో అఫ్రిది పూర్తి భిన్నంగా ఉంటాడన్నారు.