ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మూడో వన్డేలో విశేషాలు: హుస్సే వెయ్యి పరుగులు (Third One Day | Highlights | Michael Hussey | Dhoni | Pointing | Yuvaraj)
భారత, ఆస్ట్రేలియాల మధ్య న్యూఢిల్లీలో ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరిగిన మూడో వన్డేలో నమోదైన గణాంకాల్లో విశేషాలు ఇవిగో..
* భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మూడో వన్డేలో అబేధ్యమైన 71 పరుగులు జోడించి.. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 114.50 సగటుతో మొత్తం 229 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ధోనీయే. ధోనీ తర్వాత ఆసీస్ బ్యాట్స్‌మన్ మైఖేల్ హస్సీ 103.50 సగటుతో మొత్తం 207 పరుగులు చేశాడు.
* ధోనీ, యువరాజ్‌లు నాలుగో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో భారత అత్యుత్తమ వికెట్ భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. 2002, జనవరి 31వ తేదీన ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇదే వికెట్‌కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మొహ్మద్ కైఫ్‌లు 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
* భారత గడ్డపై ప్రత్యేకించి ఆసీస్ జట్టుపై అత్యధిక పరుగులను నెలకొల్పిన భారత మ్యాచ్ విన్నింగ్ నాలుగో వికెట్ భాగస్వామ్యం ధోనీ, యూవీలదే.
* వన్డేల్లో వందకు పైగా పరుగులతో తొమ్మిది సార్లు సెంచరీ స్థాయిలో యువరాజ్, ధోనీల మధ్య భాగస్వామ్యాలు ఉన్నాయి. ఈ తొమ్మిది సార్లు భారత్ అన్నింటిలోను విజయం సాధించింది.
* ఆసీస్‌పై ధోనీ మూడో అర్థ సెంచరీ నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో మొత్తం 33 అర్థ సెంచరీలు ధోనీ ఖాతాలో ఉన్నాయి.
* అలాగే యువరాజ్ ఆసీస్‌పై రెండు అర్థ సెంచరీ నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో మొత్తం 42 అర్థ సెంచరీలు యువీ ఖాతాలో ఉన్నాయి.
* ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఆసీస్‌పై ఆరు వికెట్ల విజయం భారత్‌కు అత్యుత్తమమైనది.
* అసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ (92 బంతుల్లో 59) భారత్‌పై ఎనిమిదో అర్ధసెంచరీ నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో మొత్తం 72 అర్థ సెంచరీలు పాంటింగ్ ఖాతాలో ఉన్నాయి.
* మైఖేల్ హుస్సే (82 బంతుల్లో 81) భారత్‌పై అత్యుత్తమ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో మరిన్ని మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్‌లలో వరుసగా మూడో అర్థసెంచరీని నమోదు చేశాడు.
* భారత్‌పై వరుసగా నాలుగు అర్థసెంచరీలు చేసిన ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ తర్వాత ఆ ఘనతను సాధించిన హీరో హుస్సే
* మూడో వన్డేలో హుస్సే తన ఇన్నింగ్స్‌తో ఈ ఏడాదిలో 1,060 పరుగులకు చేరుకున్నాడు. 2009లో వెయ్యి పరుగులను చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా హుస్సే నిలిచాడు. అంతకుముందు పాంటింగ్ (1,076), జింబాబ్వేకు చెందిన హామిల్టన్ మసాకడ్జా (1,064)లు ఈ ఘనత సాధించారు.