వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » హీరోహోండా సిరీస్: నేడు నాలుగో వన్డే (ODI Series | India | Australia | Dhoni | Ricky Poniting | Sewhag | Gambhir | Mohali)
Feedback Print Bookmark and Share
 
ఏడు మ్యాచ్‌లో హీరోహోండా సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో వన్డే సోమవారం జరుగనుంది. మొహాలీలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మరో ఓపెనర్ గౌతం గంభీర్‌లు గాయాలతో బాధపడుతున్నారు. అందువల్ల వీరిద్దరు తుది జట్టుకు ఎంపికయ్యే విషయం అనుమానంగా మారింది.

ఇదిలావుండగా, ఆసీస్‌పై వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన ధోనీ సేన మొహాలి మ్యాచ్‌ను సైతం కైవసం చేసుకుని సిరీస్‌ను 3-1 ఆధిక్యాన్ని కూడబెట్టుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. అయితే, ఆసీస్ జట్టు మాత్రం మొహాలీ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సి వుంది.

ఈ మ్యాచ్‌లో కంగారులు ఓడిన పక్షంలో.. సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల మొహాలీ మ్యాచ్‌ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇరు జట్ల అంచనా ఇలా ఉండొచ్చు.


భారత జట్టు.. ధోనీ, సచిన్, సెహ్వాగ్/కార్తీక్, గంభీర్/కోహ్లీ, యువరాజ్, రైనా, రవీంధ్ర జడేజా, హర్భజన్, ఇషాంత్, ప్రవీణ్ కుమార్, నెహ్రా.

ఆస్ట్రేలియా జట్టు.. పాంటింగ్, వాట్సన్, హస్సీ, వైట్, హెన్రిక్స్, వోజస్, జాన్సన్, సిడెల్, హౌరిట్జ్, మనౌ, బొలింగర్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.