ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మొహాలీ వన్డే గెలిస్తే ధోనీ సేనకు అగ్రస్థానమే! (India | Australia | Mohali | ODI | ICC | ODI Rankings | Dhoni | Ricky | Hussey)
ప్రపంచంలోని ఇరు మేటి జట్ల మధ్య అగ్రస్థానం దోబూచులాడుతోంది. "ఏక్ దిన్ కా సుల్తాన్"గా పేరొందిన 'టీమ్ ఇండియా'కు ఈ స్థానం మరోమారు చేరువకానుంది. జగజ్జేత ఆస్ట్రేలియాను కిందకు నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మరో మ్యాచ్ దూరంలో ధోనీ సేన ఉంది.
ఇందుకోసం సోమవారం మొహాలీలో జరిగే నాలుగో వన్డేలో భారత జట్టు విజయం సాధిస్తే, మొదటి స్థానంలో ఉన్న కంగారులను వెనక్కినెట్టి టీమ్ ఇండియా నెంబర్ వన్ స్థానాన్నికి చేరుకుంది. ఆస్ట్రేలియా ఖాతాలో ఉన్న 127 పాయింట్లకు భారత జట్టు అతిస్వల్ప తేడాతో వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో మొహాలీలో గెలుపొందితే అగ్రస్థానానికి చేరుకుంటుంది.
అలాగే, రిలయన్స్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ మాత్రం తన రెండో స్థానాన్ని కోల్పోయి, మూడో స్థానికి దిగజారాడు. ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ మైక్ హుస్సే కైవసం చేసుకున్నాడు.
వన్డే సిరీస్ ఆరంభానికి ముందు హుస్సే 12 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అయితే, ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేల్లో హుస్సే 73, 53, 81 (నాటౌట్) చొప్పున పరుగులు రాబట్టాడు. ఫలితంగా తన ర్యాంకును కూడా మెరుగుపరుచుకున్నాడు.