ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » హైదరాబాద్‌లో ఐదో వన్డే: నేటి నుంచి టిక్కెట్ల విక్రయం! (Hyd | Uppal Stadium | Fifth ODI | India | Australia | Tickets | UCO bank)
హైదరాబాద్‌లో ఐదో వన్డే: నేటి నుంచి టిక్కెట్ల విక్రయం!
సోమవారం, 2 నవంబర్ 2009( 10:56 IST )
File
FILE
ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం జరుగనుంది. ఈ మ్యాచ్‌లో సోమవారం నుంచి టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈ మ్యాచ్ కోసం మొత్తం 28,245 టిక్కెట్లను విక్రయించనున్నారు.
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్టేడియం పూర్తి సామర్థ్యం 39 వేలు కాగా, అభిమానుల కోసం 28 వేల టిక్కెట్లను విక్రయించాలని నిర్ణయించారు. టిక్కెట్లలో ధరను అత్యల్పంగా రూ.300, అధికంగా రూ.5000 ఖరారు చేశారు.
టిక్కెట్ల విక్రయానికి హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని ఆరు యూకో బ్యాంక్ బ్రాంచీల్లో, ఈ-సేవా కేంద్రాలను ఎంపిక చేశారు యూకో బ్యాంక్ ద్వారా 23 వేల టిక్కెట్లు, మిగిలిన వాటిని ఈ-సేవా కేంద్రాల్లో అమ్మనున్నట్టు అధికారులు తెలిపారు.
సోమవారం ఉదయం 10 గంటల ఆరంభమయ్యే టిక్కెట్ల విక్రయంలో ప్రతి ఒక్కరికీ రెండేసి టిక్కెట్లను మాత్రమే విక్రయిస్తారు. టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు స్పష్టం చేశారు.
నగరంలోని మాదాపూర్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, మలక్‌పేట్, ఎస్.డి.రోడ్‌లోని యూకో బ్యాంక్ బ్రాంచీల్లో టిక్కెట్లను విక్రయిస్తారు. దీంతోపాటు అన్ని ఈ-సేవా కేంద్రాల్లో టిక్కెట్లను అమ్ముతారు.