ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్ స్థానంలో క్లింట్ మెక్‌కే (Allrounder | James Hopes | Clint McKay | Victoria | Fast bowler | India)
భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టును గాయాలు వేధిస్తున్నాయి. ఫలితంగా గాయాల బారిన పడిన ఆటగాళ్లు స్వదేశానికి చేరుకోవడం, వారి స్థానంలో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేయడం ఆ జట్టు సెలక్టర్లకు తలకుమించిన భారంగా మారింది.
ఇప్పటికే, ప్రధాన బౌలర్ బ్రెట్ లీ, వికెట్ కీపర్ పెయినీలు గాయపడిన స్వదేశానికి చేరుకున్నారు. వీరితో పాటు.. చీలమండ గాయంతో బాధపడుతూ వచ్చినా ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్‌కు స్వదేశానికి చేరుకోనున్నారు. ఆయన స్థానంలో విక్టోరియా ఫాస్ట్ బౌలర్ క్లింట్ మెక్‌కేను ఎంపిక చేశారు.
ఈ క్రికెటర్ త్వరలోనే భారత్‌కు చేరుకుంటారని క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్టర్లు చెప్పారు. ఇదిలావుండగా, ఆసీస్ వికెట్ కీపర్ పయనీ స్థానంలో ఎంపికైన మనౌ ఢిల్లీలో జరిగిన మూడో వన్డేలో ఆడిన విషయం తెల్సిందే. ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంతో ఉన్న విషయం తెల్సిందే.
ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే, ఆ జట్టును గాయాలు వేదిస్తున్నాయి. తొలి వన్డేలో ఆడిన హోప్స్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి మైదానం వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత హోప్స్‌కు తగిలిన గాయంపై వైద్య పరీక్షలు నిర్వహించగా, సిరీస్ మొత్తానికి దూరం కావాలని వైద్యులు తేల్చారు.