మొహాలీ వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

సోమవారం, 2 నవంబర్ 2009( 14:55 IST )
ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డే సోమవారం మొహాలీలో ఆరంభమైంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన "టీమ్ ఇండియా" కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యర్థి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఫలితంగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్లు వాట్సన్, మార్ష్‌లు రెండు ఓవర్లలో ఐదు పరుగులు చేసింది.
ఇదిలావుండగా, భారత తుది జట్టులోకి గౌతం గంభీర్‌ను పక్కన పెట్టింది. మూడో వన్డేలో రికీ పాంటింగ్ కొట్టిన బంతి తగిలి గాయపడిన గంభీర్‌ను పక్కన పెట్టారు. అతని స్థానంలో విరాట్ కోహ్లీని తీసుకున్నారు. కాగా, ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేల్లో రెండింటిలో భారత్ విజయం సాధించగా, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. ఇరు జట్ల తుది వివరాలు ఇలా వున్నాయి.
భారత్.. టెండూల్కర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, ధోనీ, జడేజా, హర్భజన్ సింగ్, ఆశీష్ నెహ్రా, ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ.
ఆస్ట్రేలియా.. వాట్సన్, మార్ష్, పాంటింగ్, వైట్, హుస్సే, హెన్రిక్యూస్, జాన్సన్, మనౌ, హౌరిట్జ్, సిడెల్, బొలింగర్.