వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మొహాలీ వన్డే: నిలకడగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ (Mohali | ODI | Australia | Batting | Ricky | Ravindra Jadeja | Dhoni | Run Out)
Feedback Print Bookmark and Share
 
మొహాలీలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన ఆ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా అద్భుత త్రోతో వికెట్లను గిరాటేయడంతో పాంటింగ్ పెవిలియన్ దారి పట్టాడు. ఫలితంగా ఆ జట్టు మూడో వికెట్‌ను 123 పరుగుల వద్ద కోల్పోయింది.

అంతకుముందు భారత కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించిన విషయం తెల్సిందే. జట్టులోకి గాయపడిన గంభీర్‌ను పక్కన పెట్టి విరాట్ కోహ్లీకి తుది జట్టులోకి తీసుకున్నాడు. అయితే, ఓపెనర్లుగా బరిలోకి దిగిన వాట్సన్ (49), మార్ష్‌ (5)లు జట్టుకు శుభారంభాన్ని ఇవ్వలేక పోయారు.

ఫలితంగా ఆ జట్టు తొలి వికెట్‌ను 24 పరుగుల వద్ద కోల్పోయింది. ఆశీష్ నెహ్రా బౌలింగ్‌లో మార్ష్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రికీ పాంటింగ్ జట్టును ఆదుకున్నాడు. 59 బంతులను ఎదుర్కొన్న రికీ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేసి, భారత బౌలర్లను భయపెట్టాడు.

అయితే, జట్టు స్కోరు 88 పరుగుల మీద ఉండగా వాట్సన్ (49) అవుట్ అయ్యాడు. భజ్జీ బౌలింగ్‌లో ధోనీ స్టంపింగ్ చేయడంతో అర్థ సెంచరీకి ఒక్క పరుగు తేడాతో కోల్పోయాడు. రికీ-వాట్సన్‌ను రెండో వికెట్‌కు 64 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వైట్ (34), హుస్సే (24)లు నింపాదిగా ఆడటంతో ఆసీస్ జట్టు స్కోరు 34 ఓవర్లలో 163 పరుగులు చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.