వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మొహాలీ వన్డే: భారత్ ముంగిట విజయలక్ష్యం 251 (Mohali | India | Australia | ODI | Ashis Nehra | Overs | Batting | Run outs)
Feedback Print Bookmark and Share
 
మొహాలీ వన్డేలో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు 49.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ ముంగిట 251 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. ఆసీస్ జట్టును రికీ పాంటింగ్ (52), వైట్ (62), హుస్సే (40), వాట్సన్ (49)లు మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో ఆశీష్ నెహ్రా ఎనిమిది ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్ 10 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, యువరాజ్ సింగ్ ఒక వికెట్ చొప్పున తీశారు.

అయితే, భారత ఫీల్డర్లు మైదానంలో మెరుపు వేగంతో కదిలి నాలుగు రనౌట్లు చేయడం గమనార్హం. అంతకుముందు కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎచుకున్నాడు. ఆసీస్ జట్టు తరపున వాట్సన్, మార్ష్‌లు ఓపెనర్లుగా దిగారు. వీరిద్దరు శుభారంభాన్ని ఇవ్వలేక పోయారు. అయితే, ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రికీ పాంటింగ్ అద్భుతంగా ఆడటంతో ఆ జట్టు పుంజుకుంది.

వాట్సన్‌తో కలిసి రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టు ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. మంచి జోరుమీద ఉన్న రికీని జడేజా అద్భుత బంతితో రనౌట్ చేశాడు. ఆ తర్వాత వైట్, వైట్ అర్థ సెంచరీతో, హుస్సే 40 పరుగులతో రాణించారు. అయితే టెయిల్ ఎండే బ్యాట్స్‌మెన్స్ పెద్దగా రాణించలేదు. దీంతో ఆసీస్ 250 పరుగులు కూడా దాటలేదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.