నేడు పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే

మంగళవారం, 3 నవంబర్ 2009( 10:15 IST )
తటస్థ వేదిక అబుదాబీపై మరో క్రికెట్ సమరానికి మంగళవారం నుంచి తెరలేవనుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే నేడు జరుగనుంది. దీనికి తటస్థ వేదిక అబుదాబీ వేదిక నుంది. ఈ రెండు జట్లు రిలయన్స్ ఐసీసీ ర్యాంకుల పట్టికలో నాలుగో స్థానికి పోటీ పడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో పాక్ ఆటగాళ్లు ఉన్నారు.
మరోవైపు ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితోనే పాక్ ఆటగాళ్లను చెడుగుడు ఆడుకోవాలనే పట్టుదలతో కివీస్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఈ పర్యటనకు కివీస్ జట్టు కోచ్ లేకుండానే రావడం గమనార్హం. అటు కోచ్, ఇటు కెప్టెన్ విధులను జట్టు సారథి డేనియల్ వెట్టోరి పోషించనున్నాడు. ఇరు జట్ల బలాబలాలు కూడా సరి సమానంగా ఉన్నాయి. ఇరు జట్ల వివరాలు..
పాకిస్థాన్,.. సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మాల్, యూసుఫ్, అక్మల్, షోయబ్ మాలిక్, షాహిద్ ఆఫ్రిది, హాసన్, రజాక్, ఉమర్ గుల్, అజ్మల్, అమీర్.
న్యూజిలాండ్.. మెక్‌కల్లమ్, రెడ్‌మండ్, బ్రెండన్, గుప్తిల్, రాస్ టేలర్, స్టైరిష్, వెట్టోరి, నీల్ బ్రూమ్, షేన్ బాండ్, ఓరమ్, బట్లర్, సౌథీ.