వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » వెస్టిండీస్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ క్రిస్ గేల్‌‌కే.. (Gayle | back | West Indies | skipper | Australia Tour | Tests | Cricket)
Feedback Print Bookmark and Share
 
వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా క్రిస్ గేల్ మళ్లీ నియమితులయ్యాడు. ఈనెలాఖరులో చేపట్టనున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం గేల్ సారథ్యంలో పూర్తిస్థాయి విండీస్ జట్టును ఆ దేశ సెలక్టర్లు ప్రకటించారు. ఈ పర్యటనలో విండీస్ జట్టు మూడు టెస్టులు ఆడనుంది.

కాగా, గత మూడు నెలలుగా విండీస్ క్రికెట్ బోర్డులో నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాల వారు నిర్ణయించారు. ఫలితంగా సాధారణ స్థితి నెలకొననుంది.

ఇందులోభాగంగా ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన జట్టుకు కెప్టెన్‌గా గేల్‌ను నియమించగా, సీనియర్ ఆటగాళ్లైన చందర్‌పాల్, శర్వాన్, బ్రోవోలకు కూడా చోటు కల్పించారు. కాంట్రాక్టుల వ్యవహారంలో బోర్డు అధికారులకు, క్రికెటర్లకు మధ్య మనస్పర్థలు తలెత్తిన విషయం తెల్సిందే.

వెస్టిండీస్ జట్టు వివరాలు..క్రిస్ గేల్ (కెప్టెన్), ఆడ్రిన్, బారత్, సులైమాన్ బన్, బ్రోవో, చందర్‌పాల్, నర్సింగ డియోనారైన్, దౌలిన్, బ్రెండెన్ నాష్, దినేష్ రామ్‌దిన్, రవి రాంపాల్, కెమర్ రోచ్, డారెన్ సమ్మీ, రామ్ నరేష్ శర్వాణ్, జెరోమ్ టేలర్, గవిన్ టోంగ్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.