వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మరో 7-8 నెలలు ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు: బీసీసీఐ (No Indo-Pak | series | 7-8 months | Manohar | Butt | BCCI | PCB | Cricket)
Feedback Print Bookmark and Share
 
మరో ఏడు, ఎనిమిది నెలల పాటు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్‌కు స్పష్టం చేశారు. అయితే వచ్చే యేడాది పరిస్థితులు చక్కబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ హామీ ఇచ్చారు.

మొహాలీలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే సందర్భంగా ఇజాజ్ భట్, శశాంక్ మనోహర్‌లు సమావేశమై, పాక్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించే అంశంపై చర్చించారు. ఆ సమయంలో మరో ఏడు ఎనిమిది నెలల పాటు ఇది సాధ్యపడబోదని ఆయన భట్‌కు మనోహర్ తేల్చి చెప్పారు.

ఇండో-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లపై ప్రభుత్వ అనుమతి లేనిదే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని బీసీసీఐ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా తెలిపారు. ఇరు దేశాల మధ్య మళ్లీ క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించాలని భట్ పట్టుబడుతుండగా, మనోహర్ మాత్రం అలాంటి పరిస్థితి ఇప్పట్లో లేదన్నారు. ఎందుకంటే 7, 8 నెలలో పాటు భారత జట్టు బిజీ షెడ్యూల్ ఉందని చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.