ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » హైదరాబాద్‌కు చేరుకోనున్న భారత్-ఆస్ట్రేలియా జట్లు (Hyd | India | Australia | Uppal | Fifth ODI | Day and Night Match | Dhoni | Ricky)
ఏడు మ్యాచ్‌ల హీరో హోండా సిరీస్‌లో భాగంగా ఐదో వన్డేలో తలపడేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నాయి. వచ్చే గురువారం ఇరు జట్ల మధ్య ఐదో వన్డే ఉప్పల్‌లోని శ్రీ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో డే అండ్ నైట్‌గా జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇక్కడకు రానున్నాయి.
నాలుగో వన్డే జరిగిన మొహాలీ నుంచి ఇరు జట్లు సాయంత్రం బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని, నేరుగా తమకు కేటాయించిన హోటళ్ళకు చేరుకుంటాయని సమాచారం. భద్రతా కారణాల రీత్యా జట్టు రాకపోకల పూర్తి వివరాలను అధికారులు వెల్లడించేలేదు. ఇదిలావుండగా, ఇప్పటి వరకు జరిగిన నాలుగు వన్డేల్లో ఇరు జట్లు తలా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి సమాంగా ఉన్న విషయం తెల్సిందే.