వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మరోమారు అత్యల్ప స్కోరుకే జింబాబ్వే ఆలౌట్ (Zimbabwe | Team | skittled | fourth ODI | Bangladesh | Canada | Chittagong)
Feedback Print Bookmark and Share
 
జింబాబ్వే క్రికెట్ జట్టు మరోమారు అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప స్కోర్లలో రెండు ఈ జట్టు చేసినవే కావడం గమనార్హం. మంగళవారం మరోమారు కేవలం 44 పరుగులకే ఆలౌట్ అయింది. ఇలా నాలుగో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రికార్డు పుటలకెక్కింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న జింబాబ్వే జట్టు మంగళవారం చిట్టగాంగ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో నాలుగో వన్డేలో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే కేవలం 44 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని మాల్కోమ్ వాల్లెర్ (13), స్టువర్ట్ మసికెన్యేరి (11)లు మాత్రమే రెండంకెల స్కోరును చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అంతా అటు వచ్చి ఇటు వెళ్లిపోయారు. ఫలితంగా 44 పరుగులకే ఆలౌట్ అయింది.

గతంలో నమోదైన అత్యల్ప స్కోర్లను పరిశీలిస్తే... 2004 సంవత్సరంలో సొంత గడ్డ హరారేలో శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు కేవలం 35 పరుగులకే ఆలౌట్ అయింది. ఇదే అతి తక్కువ స్కోరుగా ఉంది. ఆ తర్వాత 2003లో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శ్రీలంక-కెనడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కెనడా జట్టు 36 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆ తర్వాత జింబాబ్వే జట్టు మరోమారు 38 పరుగులకే కుప్పకూలింది. 2001లో కొలంబోలో పర్యటించిన జింబాబ్వే జట్టు ఈ స్కోరు చేసింది. తాజాగా మరో మారు ఇలాంటి స్కోరునే నమోదు చేయడం గమనార్హం. కాగా, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.