ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ: సిడెల్ ఔట్ (Australia | India | ODI Series | Siddel | Bret Lee | Injury | Mohali | Bowling)
ఇప్పటికే కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి కొట్టుమిట్టాడుతున్న ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ సిడెల్‌కు గాయమైంది. ఫలితంగా ఆయన సిరీస్‌కు దూరమయ్యాడు. మొహాలీలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన నాలుగో వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సిడెల్ కాలి కండరాలు పట్టేశాయి. దీంతో మైదానం నుంచి అర్థాంతరంగా వీడాడు.
అనంతరం సిడెల్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, ఫిజియో.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు దీంతో సిడెల్ స్వదేశానికి వెళ్లనున్నాడు. మొహాలీ మ్యాచ్‌లో సిడిల్ ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. సమస్య తీవ్రమైనది కాకపోయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా స్వదేశం పంపడం మంచిదని ఫిజియో కెవిన్ సిమిస్ జట్టు మేనేజ్‌మెంట్‌కు విన్నవించాడు.
కాగా, ఇప్పటికే, ప్రధాన బౌలర్ బ్రెట్‌లీ, ఆల్‌రౌండర్, జేమ్స్ హోప్స్, వికెట్ కీపర్ పెయిన్‌లు స్వదేశానికి చేరుకున్న విషయం తెల్సిందే. మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న నాథన్ బ్రాకెన్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. క్లింట్ మెక్‌కే, హెన్రిక్స్ ఆసీస్ జట్టులో చేరారు. సిడెల్ స్థానంలో నాన్నెస్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని జట్టు వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి.