ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ (ODI | Bangladesh | Zimbabwe | Batting | Wickets | Innings | Canada)
సొంత గడ్డపై పర్యాటక జింబాబ్వే జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు 3-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి, మూడు, నాలుగు మ్యాచ్‌లలో బంగ్లా జట్టు విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో జింబాబ్వే గెలుపొందింది.
ఇదిలావుండగా, వన్డే సిరీస్‌లో భాగంగా చిట్టగాంగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు కేవలం 44 పరుగులకే కుప్పకూలింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో నమోదైన అతి స్పల్ప నాలుగో స్కోరు ఇదే కావడం గమనార్హం. గతంలో ఈ జట్టే రెండు సారు అతి స్పల్ప స్కోర్లు సాధించగా, కెనడా జట్టు ఒకసారి చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు ఇన్నింగ్స్ కేవలం 24.5 ఓవర్లలోనే ముగిసింది. జట్టులో వాల్లెర్ (13), మట్సికెన్యేరి (11)లు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ఎవరూ రెండంకెల స్కోరును చేయలేదు. ఫలితంగా 1.77 పరుగుల సటుతో 44 పరుగులు చేసింది.
ఆతర్వాత స్పల్ప విజయలక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. ఓపెనర్ ఇక్బాల్ అధికంగా 22 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లు హోసైన్, రజాక్‌లు రెండేసి, ఇనాముల్, అల్ హాసన్‌లు మూడేసి వికెట్లు తీశారు. అలాగే, జింబాబ్వే జట్టులో ప్రైస్, క్రెమెర్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.