ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » వచ్చే ఏప్రిల్‌లో ముంబై ప్రీమియర్ లీగ్: ఎంసీఏ (MCA | Mumbai Premier League | April | Dilip Vengsarkar | IPL | Mumbai)
వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో ముంబై ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయని ఎంపీఎల్ కమిటీ ఛైర్మన్ దిలీప్ వెంగ్‌సర్కార్ తెలిపారు.
ట్వంటీ-20 టోర్నమెంట్లకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ముంబై ప్రీమియర్ లీగ్ తరహా పోటీలను నిర్వహించాలని ఎంసీఏ భావించారు. ఇందులోభాగంగానే ఈ ఎంపీఎల్‌కు శ్రీకారం చుట్టారు.
దీనిపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ఎంపీఎల్ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయని చెప్పారు. ప్రతి జట్టు మిగిలిన ఏడు జట్లతో ఒక్కో లీగ్ మ్యాచ్‌ను ఆడుతుందన్నారు.
ఈ టోర్నమెంట్‌పై ఇప్పటికే అరడజను ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఈవెంట్ మార్కెటింగ్ కమిటీని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా, వచ్చే 15 రోజుల్లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.