వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మొహాలీ వన్డే: ఆస్ట్రేలియా జట్టుకు జరిమానా! (Mohali ODI | Australia | India | Ricky | Dhoni | Overs | Fine | Tickets)
Feedback Print Bookmark and Share
 
మొహాలీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించినప్పటికీ.. నిర్ణీత సమయానికి ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు జరిమానా విధించారు. జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, జట్టులోని ఇతర ఆటగాళ్ళ ఫీజులో పది శాతం చొప్పున కోత విధిస్తూ మ్యాచ్ రెఫరీ క్రిస్ బ్రాడ్ ఫైన్ విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం నిర్ణీత సమయానికి తక్కువ ఓవర్లు పూర్తి చేసినందుకు గాను ఒక్కొక్క ఓవర్‌కు మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం ఫైన్‌ విధిస్తారు.

కాగా, ఏడు మ్యాచ్‌ల హీరోహోండా సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు 2-2 తేడాతో సమంగా ఉన్న విషయం తెల్సిందే. దీంత గురువారం హైదరాబాద్‌లో జరిగే ఐదో వన్డేపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.