ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » బంగ్లాదేశ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్: మిస్బాకు గ్రీన్ సిగ్నల్ (PCB | gives | permission | Misbah | play | Bangladesh | Cricket | Pakistan)
బంగ్లాదేశ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్: మిస్బాకు గ్రీన్ సిగ్నల్
బుధవారం, 4 నవంబర్ 2009( 14:59 IST )
బంగ్లాదేశ్ ఫస్ట్‌క్లాస్ దేశవాళీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాడు మిస్బావుల్ హక్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ అనుమతి ఇచ్చింది. ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న మిస్బాను ప్రస్తుతం న్యూజిలాండ్‌తో తటస్థ వేదిక అబుదాబీలో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు.
ఈ నేపథ్యంలో... బంగ్లా గడ్డపై జరిగే ఫస్ట్‌క్లాస్ డొమెస్టిక్ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని మిస్బావుల్ హక్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేసుకున్నాడు. స్వదేశంలో జరిగే దేశవాళీ టోర్నమెంట్ ఖ్వైద్ ఇ అజామ్ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడాలని తొలుత సూచించింది.
ఇంతలోనే మనస్సు మార్చుకున్న పీసీబీ పెద్దలు బంగ్లా టోర్నమెంట్‌లో ఆడేందుకు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని మిస్బా స్పష్టం చేశాడు. అభానీ స్పర్ట్స్ క్లబ్‌లో ఐదు లేదా ఆరు వన్డే మ్యాచ్‌లు ఆడేలా మంచి అవకాశం లభించిందని, ఇందులో తన సత్తా చాటుతానని మిస్పా చెప్పాడు. ఇందుకోసం ఈనెల ఎనిమిది తేదీల్లో ఢాకాకు వెళ్లనున్నట్టు చెప్పారు. ఇది తనకు మంచి ప్రాక్టీస్గా కూడా ఉంటుందన్నాడు.