ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఆల్‌రౌండర్ హెన్రిక్యూస్‌కు గాయం: వన్డేకు దూరం? (Henriques | picks | injury | play | tomorrow | Australia | India | Uppal | ODI)
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయాలబారిన పడుతున్నారు. బుధవారం మరో క్రికెటర్ గాయపడ్డారు. ఆ జట్టు ఆల్‌రౌండర్ మొయాసెస్ హెన్రిక్యూస్‌కు భుజం గాయమైంది. ఫలితంగా గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ఐదో వన్డేకు దూరమయ్యాడు.
కాగా, ఆసీస్ జట్టు ఇప్పటికే ప్రధాన ఆటగాళ్ళను గాయాలు వేధిస్తుండటంతో సిరీస్‌కు దూరమవుతున్న విషయం తెల్సిందే. దీనిపై ఆసీస్ జట్టు కోచ్ టిమ్ నీల్సన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కుడిచేయి భుజం గాయంతో హెన్రిక్యూస్ బాధపడుతున్నాడని, అందువల్ల గురువారం జరిగే మ్యాచ్‌లో ఆడటం లేదని తేల్చి చెప్పాడు.
కాగా, వన్డే సిరీస్ రసదాయకంగా మారుతున్న కొద్దీ ఆసీస్‌కు చెందిన ఆటగాళ్లు ఒక్కొక్కరు గాయపడుతున్నారు. ఇప్పటికే ఆ జట్టు వైఎస్ కెప్టెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మైకేల్ క్లార్క్, ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ, ఆల్‌రౌండర్ హోప్స్, వికెట్ కీపర్ టిమ్ పయిని, బౌలర్ పీటర్ సిడెల్‌లు జట్టుకు దూరమైన విషయం తెల్సిందే.